సంగ్రహముగా కీ.శే.నరసింహదేవర వేంకటశాస్త్రిగారి జీవితచరిత్ర.
కీ.శే.వేంకటశాస్త్రిగారారామ ద్రావిడ శాఖకు చెందినవారు. శ్రీవత్స గోత్రులు.తాడేపల్లిగూడెము
తాలూకాలోని జట్లపాలెమను గ్రామములో మాతామహుని యింట జన్మించారు. పశ్చిమగోదావరీ మండల మందలి తణుకు తాలూకాలోని వెలగదుర్రు గ్రామము వీరి నివాసస్థానము.
క్రీ.శ.1828వ సంవత్సరం అంటే సర్వజిన్నామ సంవత్సర కార్తీక శుద్ధ విదియనాడు జన్మించి క్రీ.శ.1915వ సంవత్సరం అంటే రాక్షసనామ సంవత్సర శ్రావణ బహుళ పంచమిని నిర్యాణము చెందిరి. వేంకటశాస్త్రిగారి తల్లి సీతమాంబ(సుప్రసిద్ధ వైద్యులగు వరదావారి ఆడపడుచు),తండ్రి ఉమామహేశ్వరశాస్త్రి.వీరి సహధర్మచారిణి లక్ష్మీనరసమ్మ.వేంకటశాస్త్రి గారు విచిత్రరామాయణమనెడి మహాకావ్యమును,గౌరీ శతకమును,వేంకటేశ్వర శతకమును, విరాగసుమతీ సంవాదమును రచించారు. వీరి సంగీతప్రకర్షకు విరాగసుమతీ సంవాదమందలి కీర్తనలే తార్కాణములు.వేంకటేశ్వర శతకము వీరి తొలి రచనము.
వీరి నివాసగ్రామమునకు గొలది దూరంలో వశిష్ఠ గోదావరీతీరమున జినవాడపల్లి యను గ్రామంలో వేంచేసియున్న వేంకటేశ్వరస్వామినుద్దేశించి శృంగారరసప్రధానమగు
సీసపద్యములలో "విబుధనుత వాడపల్లీశ !వేంకటేశ! యను మకుటముతో దానిని రచించెను.కీ.శే.వేంకటశాస్త్రి గారికి వేంకటరత్నమ్మ యను నొక కుమార్తెయును,పరబ్రహ్మ
శాస్త్రి,పేరుశాస్త్రి,శేషయ్యశాస్త్రి వేంకటరమణశాస్త్రి, నారాయణ మూర్తి, ఉమామహేశ్వరశాస్త్రి యను నార్గురు కుమారులు నుండిరి.
వీరిలో రెండవ కుమారుడైన పేరుశాస్త్రిని తూర్పుగోదావరీ మండలములోని ఆలమూరు
గ్రామ నివాసియగు నరసింహ దేవర వేంకటశాస్త్రిగారికి దత్తుగానిచ్చిరి.కీ.శే.వేంకట
శాస్త్రిగారు మా అమ్మ సీతామహాలక్ష్మిగారికి ముత్తాత.రేపు వేంకటశాస్త్రి గారి వర్ధంతి.
ఈసందర్భముగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను.మన వంశపెద్దలను జ్ఞప్తికి తెచ్చు
కొనుచుండుట,స్మరించు చుండుట మన కర్తవ్యము, శ్రేయోదాయకము.మా పితృదేవతల పదకమలములకు శతకోటివందనములర్పిస్తూ...
-- శ్రీమతి అన్నపూర్ణ.

No comments:
Post a Comment